బార్లీ జావను ప్రతిరోజు తీసుకోవచ్చా…తీసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా?

సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, వేసవిలో అయితే డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడడానికి బార్లీ జావా లేదా సగ్గుజావను తీసుకోవడం సర్వసాధారణం అయితే ప్రతిరోజు బార్లీ నీళ్లను సేవిస్తే మనలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు బార్లీ జావా సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో సర్వసాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య తొందరగా శరీర బరువు పెరగడం దాని ఫలితంగా ఉబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు, షుగర్ వంటి సమస్యలు తలెత్తడం. ఇలాంటి సమస్యలను మన నుంచి దూరంగా ఉంచాలంటే మొదట శరీర బరువును పెరగకుండా చూసుకోవాలి దానికి ప్రతిరోజు బార్లీ నీళ్లను అల్పాహారానికి ముందే సేవిస్తే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నావా తరచూ ఈ నీళ్లను సేవిస్తే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ తగ్గి కిడ్నీలో చిన్నచిన్న రాళ్లు సైతం తొలగిపోతాయని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా మనకు జ్వరం వచ్చింది అంటే ఏ ఆహార పదార్థాన్ని తినాలనిపించదు ఫలితంగా నీరసం వచ్చి శరీర జీవ క్రియలు మందగిస్తాయి కావున జ్వరం ,నీరసంగా ఉన్నప్పుడు, డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు బార్లీ జావా ను క్రమం తప్పకుండా మూడు పూటలా సేవిస్తే మన శరీరానికి అవసరమైన శక్తి తొందరగా లభించి అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. పిల్లలకు తరచూ బార్లీ జావను తినిపిస్తే వీటిలో సమృద్ధిగా ఉన్న ప్రోటీన్స్ ,విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ పిల్లలు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

డయాబెటిస్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తరచూ బార్లీ నీళ్లను సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను శరీరంలోని మరియు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గర్భిణీ మహిళలు రోజుకు రెండుసార్లు బార్లీ నీళ్లను సేవిస్తే శిశువు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాళ్లవాపులు, మూత్రశయ ఇన్ఫెక్షన్, అజీర్తి, మలబద్ధకం,గ్యాస్టిక్ వంటి సమస్యలు తొలగిపోతాయి