శనగ గింజలను ఈ విధంగా ఉపయోగిస్తే ఉబకాయం, హైబీపీ, క్యాన్సర్, కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

నవధాన్యాల్లో శనగలకి ప్రత్యేక స్థానం ఉంది.
శనగల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం ,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. శనగలను మొలక కట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఆహారంగా తీసుకుంటే మనలో పౌష్టికాహార లోపాన్ని సరిచేసుకొని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

మొలకెత్తిన శనగ గింజల్లో ప్రోటీన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు పీచు పదార్థాలు నెమ్మదిగా జీర్ణం అయ్యి మనలో ఆకలిని కలిగించే హార్మోన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంతో మనలో క్యాలరీలు తగ్గి నడుము చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంతోపాటు ఉబకాయం, హై బీపీ సమస్యలను మన దరిచేరకుండా ఆపుతుంది. మొలకెత్తిన సెనగ గింజల్లో క్యాల్షియం పొటాషియం అధికంగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య తొలగడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థ మెరుపు పడుతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన శనగ గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉన్న లైకోపిన్, షాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, బ్యూటీన్ ప్యాంటీ ఆమ్లాలు మన శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి. శనగల్లో అత్యధికంగా ఉన్న పాస్ఫరస్ కిడ్నీలోని వ్యర్థాలను తొలగించి కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. జాండీస్ తో బాధపడేవారు శనగలను బెల్లంతో కలిపి నానబెట్టుకుని ప్రతిరోజు తింటే జాండీస్ తగ్గుముఖం పడుతుంది.

మొలకెత్తిన సెనగ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే వీటిని ఆహారంగా తీసుకుంటే ప్రమాదకర రక్తహీన సమస్యను దూరం చేసుకోవచ్చు. శనగల్లోని కోలిన్ అనే పదార్థం నాడీ కణాల అభివృద్ధికి సహాయపడి మెదడును చురుగ్గా ఉంచడంతోపాటు మానసిక ఒత్తిడిని, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.మొలకెత్తిన శనగల్లో ఫైబర్ సమృద్దిగా ఉండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.