నల్ల నువ్వులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. నల్ల నువ్వులు చూడటానికి చిన్నగా కనిపించినా ఈ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. శీతాకాలంలో నల్ల నువ్వులను తినడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. నల్ల నువ్వులు తినడం వల్ల ఎన్నో వ్యాధులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఈ నువ్వులు ఎంతో రుచికరంగా ఉంటాయి.
నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. నువ్వులతో లడ్డు చేసుకుని తింటే ఆ లడ్డు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుందని చెప్పవచ్చు. నల్ల నువ్వులు తినడం వల్ల కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.
నల్ల నువ్వులు తినడం వల్ల జుట్టు, చర్మం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండగా ఎన్నో వ్యాధుల నుంచి శరీరంను రక్షించడంలో నల్ల నువ్వులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గించడంలో నల్ల నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ కు సైతం నల్ల నువ్వులతో చెక్ పెట్టవఛ్చు.
నల్ల నువ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నల్ల నువ్వులు తీసుకోవడం ద్వారా విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయని చెప్పవచ్చు. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా చేయడంలో నల్ల నువ్వులు తోడ్పడతాయని చెప్పవచ్చు.