గుండె ఆరోగ్యాన్ని రక్షించే బ్లాక్ క్యారెట్… ఇందులోని పోషక విలువల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే.సాధారణంగా ఆరెంజ్ కలర్ క్యారెట్ తో పోల్చినప్పుడు నూతనంగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ కలర్ క్యారెట్ అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ కలర్ క్యారెట్ లో కన్నా బ్లాక్ కలర్ క్యారెట్ల లో అత్యధికంగా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తున్నాయి. తరచూ బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ క్యారెట్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మనం తీసుకునే ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి గ్యాస్టిక్, అజీర్తి మలబద్ధకం, తేపులు వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ క్యారెట్ను రోజువారి ఆహారంలో తీసుకుంటే మంచిది. బ్లాక్ క్యారెట్లో విటమిన్ ఏ,బీటా కెరోటిన్ సమృద్ధిగా లభ్యమవుతుంది కావున కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరిచి కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను , అలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు బ్లాక్ క్యారెట్ తీసుకునేవారు భవిష్యత్తులో కళ్ళజోడుతో పని ఉండదని చెప్తుంటారు డాక్టర్లు.

బ్లాక్ క్యారెట్‌లోనీ విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది ఇవి గుండె పనితీరు లోపాలను సవరించి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.అలాగే నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు లోపాలను సవరించి
అల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు బ్లాక్ క్యారెట్ జ్యూస్ ప్రతిరోజు సేవిస్తే రక్తంలో గ్లూకోస్ నిలువలను తగ్గించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయ సమస్యను దూరం చేస్తుంది.