Honey: ‘తేనె’ వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా..!!

‘తేనె’ లేని వంటిల్లు ఉండదు. అద్భుతమైన రుచి ఉన్న తేనె తీసుకోని వారు ఉండరు. తనలో ఎన్నో ఔషధ గుణాలు ఇమిడ్చుకున్న తేనె మన ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శ్రేష్టమైన తేనెలో సుగుణాలెన్నో ఉన్నాయి. మంచి ఆరోగ్యం, బలం ఇస్తుంది. అనారోగ్యాలను దూరం చేస్తుంది. అంతర్గతంగానే కాదు.. బాహ్యంగా మన అందాన్ని కూడా ద్విగుణీకృతం చేస్తుంది. మన ముఖాన్ని అందంగా ఉండేలా చేస్తుంది. మేని ఛాయతో మెరిసేలా మారుస్తుంది. ఇలా.. తేనెతో ఎన్నో ప్రయోజనాలు మన జీవనంలో ముడిపడి ఉన్నాయి. ఆహర వినియోగంలో పంచదార తగ్గించి తేనె తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది.

బాడీ అంతా ఫ్రెష్ గా ఉండాలి.. క్లీన్ గా ఉండాలంటే స్నానం చేసే నీటిలో మూడు టీస్పూన్ల తేనె, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు రెండుసార్లు తేనె తీసుకోవడం ఉత్తమం. అందంగా, మేని ఛాయతో నాజూగ్గా ఉండాలన్నా తేనె వాడకం తప్పనిసరి. దగ్గు వస్తుంటే.. ఓ టీస్పూన్ తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ బదులుగా తేనెను వాడొచ్చు. ఇందులో కమ్మొమైల్ ఉంటుంది. అది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. తేనె సహజ గుణాలున్న యాంటీబయోటిక్. శరీరపై గాయాలున్నా, కాలినా తేనెను రాసి మసాజ్ చేస్తే గాయం మటుమాయం అవుతుంది. ఉదయం అలసటగా ఉంటే తేనె, పాలు కలిపి తీసుకోవచ్చు. దీంతో బలం వస్తుంది.. యాక్టివ్ అవుతాం. ఒత్తిడితో నుంచి ఉపశమనం పొందాలన్నా టీలో ఓ స్పూన్ తేనె కలపి తీసుకుంటే సరి.

గొంతు ఇన్ ఫెక్షన్ ఉన్నా.. కఫంతో ఇబ్బంది పడుతున్నా తేనె మంచి మందులా పని చేస్తుంది. కఫాన్ని కరిగించి శ్వాసనాళాన్ని ఫ్రీగా చేస్తుంది. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుంది. దీంతో పేగుల కదలిక బాగుంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే తేను తీసుకోవడం వల్ల యాక్టివ్ గా కూడా ఉంటాం. ఇన్ని గుణాలతో ‘తేనె’ మన ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పాలి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.