ఈ మధ్య కాలంలో షుగర్, బీపీ సమస్యలతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా ఒకసారి బీపీ, షుగర్ వస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే పింక్ సాల్ట్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రక్తపోటుకు సులువుగా చెక్ పెట్టడంలో పింక్ సాల్ట్ ఉపయోగపడుతుంది.
కండరాల తిమ్మిరి సమస్య, వాంతులు, వికారం లాంటి సమస్యలను పింక్ సాల్ట్ దూరం చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో పింక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఈ సాల్ట్ ను హిమాలయన్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ తో కలిసి ఉండటం వల్ల ఈ సాల్ట్ పింక్ కలర్ లో కనిపిస్తుందని చెప్పవచ్చు. పింక్ సాల్ట్ లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
శ్వాస కోశ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పింక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో పింక్ సాల్ట్ తోడ్పడుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో పింక్ సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలసటగా, బలహీనంగా ఉండేవాళ్లు ఈ సాల్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.
అయితే పింక్ సాల్ట్ ను మితంగా తీసుకుంటే మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ సాల్ట్ ను మరీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ సాల్ట్ గురించి పూర్తిస్థాయిలో విషయాలను తెలుసుకుని మాత్రమే ఈ సాల్ట్ ను కొనుగోలు చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ లో పింక్ సాల్ట్ ఖరీదు కిలో 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో ఉంది.