ప్రతిరోజు అరటిపండును తినడం ఆరోగ్యానికి మంచిదే అన్న విషయాన్ని చాలా సార్లు వినే ఉంటాం కదా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అరటి పండులో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ కార్బోహైడ్రేట్స్, పొటాషియం ,మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే అరటిపండు ప్రతిరోజు తినే విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అవేంటంటే రోజుకు ఎన్ని అరటి పండ్లు తినాలి, ఏ సమయంలో అరటిపండును తినొచ్చు, అరటి పండ్లను అతిగా తింటే ఏమవుతుంది, అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండులో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి ఈ మూలకాలు రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. అరటిపండు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్ ,కంగారు వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది తద్వారా మలబద్ధకం, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు తొలగుతాయి. అరటి పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కావున హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది.
అరటిపండును ఉదయాన్నే అల్పాహారానికి ముందే ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు
తప్పువు అంటున్నారు వైద్యులు. అరటి పండులో ఎక్కువగా ఉండే పొటాషియం మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది ఎక్కువగా తీసుకుంటే హాని కలగవచ్చు. అరటి పండ్లను పాలు, పెరుగు వంటి అధిక కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకోరాదు. వీటిని కలిపి తింటే అజీర్తి, గ్యాస్ట్రిక్, విరోచనాలు వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. బాగా పండిన అరటి పండ్లు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి. వర్షాకాలంలో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అరటిపళ్ళను ఎక్కువగా తింటే సమస్య తీవ్రతరం అవుతుంది.
ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఒక్కరోజులో రెండు అరటి పండ్లను తినొచ్చు, అధిక శారీరక శ్రమ కలిగిన వ్యక్తులు రోజుకు మూడు అరటి పండ్లను తినడం వల్ల ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ అధిక శక్తిని కలిగించి రోజంతా ఉత్సాహంగా ఉండునట్లు చేస్తాయి. డయాబెటిస్, రక్త పోటు,హాట్ ప్రాబ్లమ్స్ ,కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యులు సలహా మేరకు ఒక అరటిపండును తినొచ్చు. పచ్చి అరటికాయను తింటే ఇందులో అధికంగా ఉండే యాసిడ్స్ కారణంగా కడుపు మంట, విరోచనాలు సమస్య వస్తుంది.
అరటిపండును ఉదయం అల్పాహారం తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం మంచిది.రాత్రి సమయాల్లో అయితే నిద్రపోవడానికి మూడు గంటల ముందు అరటిపండును తినడం మంచిది.