అరికాళ్లలో ఆనెల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యకు చెక్!

కొన్ని సమస్యలు చూడటానికి చిన్న సమస్యలలా అనిపించినా ఆ సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అరికాళ్లలో ఆనెల సమస్య వల్ల నడుస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు చెప్పులు లేకుండా నడిచే వాళ్లు ఎక్కువగా ఆనెల సమస్య వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆనెల సమస్యతో బాధ పడేవాళ్లు ఎక్కువ బరువులు మోసే సమయంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఉన్న వైద్య చికిత్స విధానాలను పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆనెల చికిత్స కొరకు మంచి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. పిండి, మరీచ తైలంను మర్ధనా చేయడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు

జిల్లేడు పాలకు పసుపు కలిపి ఆనెలకు పెట్టి ప్లాస్టర్ వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆనెలను బ్లేడ్ తో తొలగించడానికి ప్రయత్నిస్తే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అతి మధురం, ఆముదం, నువ్వుల నూనె ఒక చెంచా చొప్పున తీసుకుని పట్టించాల్సి ఉంటుంది. కాల్చిన బూడిద, హరిదళం, ఉత్తరేణిని సమభాగాలుగా చేసి పైపూతగా అప్లై చేస్తే మంచిది.

సున్నం, చౌడుమట్టి సమ భాగాలుగా తీసుకుని కొంచెం నీరు పోసి నూరి లేపనంగా అప్లై చేస్తే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా కూడా ఆనెలను దూరం చేసుకోవచ్చు. కలబంద గుజ్జును పట్టించడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.