మీ కాలి గోళ్లు ఆ రంగులో ఉన్నాయా.. ప్రాణాలకు ఎంత అపాయమో తెలిస్తే షాకవ్వాల్సిందే

మనలో చాలామంది కాలిగోళ్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలిగోళ్ల రంగు గురించి చాలామంది పట్టించుకోరు. అయితే కాలిగోళ్ల రంగు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. పాదాల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కాలి గోళ్లు పసుపు రంగులో ఉంటే ఇన్ఫెక్షన్లు కారణమని చెప్పవచ్చు.

మధుమేహం, థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ గోళ్లు కారణమవుతాయని చెప్పవచ్చు. గోళ్లు రంగు మారితే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు. కాలి గోళ్లపై మచ్చలు ఉంటే మాత్రం గాయాల వల్ల అవుతాయని చెప్పవచ్చు. శరీరంలో జింక్ లోపం ఉంటే గోళ్లు ఈ రంగులోకి మారే అవకాశం అయితే ఉంటుంది. గోళ్లు నలుపు రంగులో ఉంటే మాత్రం రక్తనాళాల సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్లు ఈ తరహా గోళ్లను కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. గోళ్లు మరీ లేతగా ఉంటే మాత్రం గుండె సంబంధిత సమస్యలు, లివర్ సమస్యలు అందుకు కారణమని చెప్పవచ్చు. లేత గోళ్లు ఉంటే మాత్రం వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. గోళ్లు నీలి రంగులో ఉంటే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

కాలి గోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జీవితాంతం బాధ పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాదాల ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పవచ్చు. కాలిగోళ్లు ఇతర రంగుల్లోకి మారితే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.