ఆహారంగా వైట్ షుగర్ కు బదులు బెల్లంను ఎక్కువగా వాడుతున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే?

తీయదనాన్ని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అయితే ప్రతిరోజు ఆహారంలో వైట్ షుగర్ ను ఎక్కువగా వినియోగిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చాలాకాలంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి పరిష్కార మార్గంగా రోజువారి ఆహారంలో బెల్లం ను ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. బెల్లంలో సమృద్ధిగా క్యాల్షియం, ఐరన్ ,ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.

ప్రతిరోజు బెల్లం లేదా బెల్లం పానీయాన్ని ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం ,సోడియం మన శరీరంలో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గించి గ్యాస్టిక్ ఉబ్బసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే బెల్లం లో ఉండే అత్యధిక పీచు పదార్థం జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి మలబద్ధక సమస్యను దూరం తగ్గించి చిన్నపేగు క్యాన్సర్ ను అరికడుతుంది
బెల్లంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీర ఎముకల దృఢత్వానికి పెరుగుదలకు సహాయపడి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తుంది.

రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ రోజువారి కార్యకలాపాల్లో అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు. ప్రతిరోజు ఉదయాన్నే బెల్లం పానీయాన్ని సేవిస్తే ఇందులో సమృద్ధిగా లభించే ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అధికం చేసి ప్రమాదకర రక్తహీనత సమస్యను తొలగిస్తుంది ఫలితంగా రోజువారీ కార్యకలాపాలు చురుగ్గా పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుంది. బెల్లంలో అత్యధికంగా ఉండే పొటాషియం రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. మెగ్నీషియం, మాంగనీస్ జీవ నియంత్రణ ద్రవాలను ఉత్పత్తి చేసి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షిస్తుంది.