సాధారణంగా పల్లెటూర్లలో మనకు స్వచ్ఛమైన తాటికల్లు ఈతకల్లు లభిస్తూ ఉంటాయి. ఇప్పటికి కొందరు ఉదయం లేవగానే ఈ స్వచ్ఛమైనటువంటి తాటికల్లును తాగుతూ ఉంటారు. ఇలా తాటికల్లు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి తాటికల్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాటికల్లు తాగటం ఆరోగ్యానికి హానికరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఈ తాటి కల్లును తాగేటప్పుడు ఈ చిన్న పొరపాటు అసలు చేయకండి.
తాజా స్వచ్ఛమైన తాటికల్లులో జీర్ణాశయ ఇన్ఫెక్షన్లను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను నయం చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మూత్రశయ ఇన్ఫెక్షన్లు తొలగి మూత్రం వెళ్ళినప్పుడు మంట రక్తం పడడం వంటి సమస్యలను నివారిస్తుంది. తాటి కల్లులో మన శరీరంలో వ్యాధి కారకాలను నశింపజేసే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.తాటికల్లులో ఉండే చఖరో మైసెస్ అనే సూక్ష్మ జీవికి ఉదర క్యాన్సర్ కు కారణం అయ్యే ఒబిఎస్ 2 అనే క్యాన్సర్ కారకాన్ని నశింప చేస్తుంది.
ఇలా తాటికల్లు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.అయితే తాటికల్లు తాగేముందు ఒక్కసారి అది స్వచ్ఛమైనది కాదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత తాగినప్పుడే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటిని పొందవచ్చు.తాటికల్లు చెట్టు నుంచి తీసిన తర్వాత రెండు గంటలలోపు తాగటం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు అలా కాకుండా రెండు గంటల తర్వాత తాగటం వల్ల అది కల్లుగా మారి విషయంగా మారుతుంది. దీనిలో ఎన్నో రకాల హానికర బ్యాక్టీరియాలో శుద్ధి చెందటం వల్ల ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయడంలో తోడ్పడతాయి అందుకే చెట్టు నుంచి తీసిన వెంటనే స్వచ్ఛమైన కళ్ళును తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలనుసొంతం చేసుకోవచ్చు లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడటం తప్పదు.