ఇంగువను ఆహారంలో తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి?

ప్రాచీన పురాతన ఆయుర్వేద వైద్యంలో ఇంగువను చాలా రకాల మొండి వ్యాధులను నయం చేయడానికి ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.ఇంగువ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ప్రత్యేకమైన పదార్థం. ఇంగువను రోజువారి ఆహార వంటకాల్లో ఉపయోగిస్తే అద్భుతమైన రుచి, సువాసన తోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మన పూర్వీకులు రోజువారి ఆహారంలో ఇంగువను ఉపయోగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు.

ప్రస్తుత రోజుల్లో ఇంగువ అంటే తెలియని వారు చాలామంది ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇంగువ ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ప్రతిరోజు ఇంగువను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇంగువలో యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున దీనిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే సీజనల్గా వచ్చే శ్వాస సంబంధిత సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా , కోరింత దగ్గు వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.

రోజువారీ వంటకాల్లో ఇంగువను తగిన పరిమాణంలో వినియోగిస్తే అద్భుతమైన రుచిని, సువాసనను ఇవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పొట్ట, పేగుల్లో ఉండే హానికర సూక్ష్మజీవులను నశింపజేసి పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్, కడుపు ఉబ్బరం, కడుపు మంటను తగ్గిస్తుంది అలాగే మలబద్ధకం అజీర్తి డయేరియా, అల్సర్ వంటి సమస్యలను మన దరిచారనివ్వదు. ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

స్త్రీలు రోజువారి ఆహారంలో ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, అధిక రక్తస్రావాన్ని నిరోధిస్తుంది. సెక్స్ సంబంధిత సమస్యలు, సంతానలేమి, అబార్షన్ అవడం వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. దంత క్షయం చిగుళ్ల వాపు పంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు ఇంగువను నీటిలో కలిపి నోట్లో వేసుకుని రోజుకు రెండు సార్లు పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల సంబంధిత వ్యాధులను రాకుండా అరికడుతుంది.