కొందరిలో కొన్ని ఆహార పదార్థాలను తినే విషయంలో రకరకాల సందేహాలు, అపోహలు కలుగుతుంటాయి. ముఖ్యంగా బాదం పప్పు లేదా బాదం గింజలు తినే విషయంలో ఓ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అదే బాదంపప్పును పచ్చిగా తింటే మంచిదా లేక నానబెట్టుకుని పొట్టు తొలగించి తింటే మంచిదా అనే సందేహం చాలామందికి కలిగే ఉంటుంది. బాదంపప్పును ఏ విధంగా తీసుకున్న మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరం గుర్తు పెట్టుకోవాలి.
అయితే తాజా అధ్యయనం నిపుణుల సూచనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల డ్రై బాదం గింజల్లో కంటే అదనపు పోషకాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు. నానబెట్టిన బాదం పప్పులో మన శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,జింక్, ఐరన్, యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్స్, పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు గుప్పెడు నానబెట్టిన బాదం గింజలను ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. వీటిలో ఉండే సహజ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి ఉబకాయ సమస్యను, రక్తపోటు, గుండెపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
బాదంపప్పులో పుష్కలంగా ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలతో సమృద్ధిగా పోరాడి అనేక క్యాన్సర్లను నియంత్రిస్తాయి. బాదంపప్పులో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఉబకాయం గుండె జబ్బులు వంటి సమస్యలను దూరం చేస్తుంది. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెంపొందుతుంది. నానబెట్టిన బాదం గింజలు మెగ్నీషియం పొటాషియం మాంగనీస్ సమృద్ధిగా లభించి మెదడు కండరాలను, నరాలను శక్తివంతంగా చేసి మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఎముకలకు అవసరమైన క్యాల్షియం ఫాస్ఫరస్ సమృద్ధిగా లభించి ఎముకలు దృఢంగా, బలిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది.