వేసవి సీజన్ నుంచి వర్షాకాల సీజన్ ప్రారంభ సమయంలో మాత్రమే లభించే చింతచిగురు అద్భుతమైన రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుల్లని రుచి కలిగిన చింతచిగురును పప్పు, పచ్చలల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతచిగురు ఏడాది అంతా అందుబాటులో ఉన్నది కాబట్టి చింతచిగురును ఆరబెట్టుకుని పచ్చడి, చింత చిగురు కారంపొడి వంటివి తయారుచేసుకొని ఏడాది పొడవునా మన ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. చింతచిగురు అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి తగిన పోషకాలను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
చింత చిగురులు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలోని వ్యాధికారకాలతో సమర్థవంతంగా పోరాడి చెడు మలినాలను బయటికి పంపించడంతోపాటు మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. అలాగే చింతచిగురును ఆహారంగా తీసుకుంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసి అలసట, నీరసం వంటి సమస్యలను తొలగించడంతోపాటు రక్తహీనత సమస్యను కూడా అదుపు చేస్తుంది.
చింతచిగురులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేసి పోషకాలను సమృద్ధిగా మనకు అందించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఉబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలను అదుపు చేస్తుంది.
చింత చిగురులో డైటరీ ఫైబర్ ,యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చింతచిగురులో కాల్షియం పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢత్వానికి తోడ్పడి కీళ్ల నొప్పు లు ,ఆర్థరైటిస్ వంటి వ్యాధులను అదుపు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో మలేరియా జ్వరానికి చింతచిగురు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.