థైరాయిడ్ సమస్య వేధిస్తోందా… ఈ గింజలతో థైరాయిడ్ కు చెక్ పెట్టండి!

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ప్రధానమైనది గానే చెప్పొచ్చు. ప్రతి ఏడాది థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఈ సమస్యకు కారణాలు ప్రతిరోజు మన జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, అధిక పని ఒత్తిడి ,జన్యుపరమైన కారణాలు, వేగంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వంటి కారణాలు ప్రధానంగా చెప్పొచ్చు.

మన శరీర జీవక్రియలను సమన్వయ పరిచే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి హార్మోను ఎక్కువగా శ్రవిస్తే హైపర్ థైరాయిడిజం, తక్కువగా శ్రవిస్తే హైపో థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి పనితీరులో ఇలాంటి వ్యత్యాసాలు ఏర్పడితే తొందరగా శరీర బరువు పెరగడం లేదా తగ్గడం ,నీరసం అలసట వంటి సమస్యలు తలెత్తడం, మలబద్ధకం, జుట్టు రాలడం, చర్మం పొడి వారం, చలి ఎక్కువగా అనిపించడం, ఆకలి మందగించడం, స్త్రీలలో నెలసరి కరెక్టుగా ఉండకపోవడం, గర్భస్రావం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వైద్య సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఈ సమస్యను అదుపులో ఉంచడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను కూడా పాటించవచ్చు

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ధనియాల కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్లో నీటిని తీసుకొని అందులో ధనియాలను వేసి బాగా మరగనివ్వాలి. ధనియాలు లేకపోతే కొత్తిమీర లేదా ధనియాల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ధనియాలు బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వడగట్టుకొని ఉంచుకోవాలి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు తగినంత తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ధనియాల్లో ఉన్న యాంటీ మైక్రోవేల్ గుణాలు సీజనల్గా వచ్చి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

అవిసె గింజలను సేకరించి వాటిని పొయ్యి పై వేయించుకున్న తర్వాత మెత్తటి పొడిగా మార్చుకోవాలి. ఆ పొడిని గాజు జారులో భద్రపరచుకొని ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని పరగడుపున సేవిస్తే థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచవచ్చు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో పాల ఉత్పత్తులను, ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పచ్చళ్ళు, రెడ్ మీట్ వంటి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.