జుట్టు రాలే సమస్య వేధిస్తుందా…. జామ ఆకులతో సమస్యను తరిమికొట్టండి?

guava_leaves_for_hair_(1)_1630311984522_1630311995003

సాధారణంగా మారిన ఆహార పలవాట్లు వాతావరణం లోని కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల చర్మ జుట్టు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు జుట్టు రాలే సమస్యతో పాటు ఇతరత సమస్యల కారణంగా ఎంతో సతమతమవుతున్నారు.ఇలా జుట్టు రాలే సమస్య కనుక వేధిస్తూ ఉన్నట్లయితే ఎన్నో రకాల షాంపూలను వాడిన ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది అయితే సహజంగా మన ఇంటి పెరటిలో దొరికే జామ ఆకులతో ఈ జుట్టు రాలే సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

జామ ఆకుల్లో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా లభించడమే. జామ ఆకులతో జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మొదట జామ ఆకులను మరిగించిన తరువాత వచ్చిన కషాయంలో రెండు టేబుల్ స్పూన్లు గోరింటాకు పొడి, స్పూన్ మెంతి పొడి, స్పూన్ మందారం పువ్వుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి.

ఇలా నెలలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తే సహజ పద్ధతిలో జుట్టు రాలడాన్ని అరికట్టి అందమైన ఓత్తైన కురులు పొందవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య మాత్రమే కాకుండా చుండ్రు సమస్యతో పాటు తలలో ఇతరత ఇన్ఫెక్షన్లు దురద వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.ఇక జామ ఆకు మరిగించిన నీటితో పంటి నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు ఈ నీటిని బాగా పుక్కిలించడం వల్ల దంత క్షయం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.