మనలో పౌష్టికాహార లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ప్రధానమైనది రక్తహీనత సమస్య దీన్ని ఎనీమియా అని కూడా అంటారు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలు లోపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి ప్రమాదకర రక్తహీనత సమస్య ఏర్పడుతుంది దీనివల్ల నీరసం, అలసట, కళ్ళు తిరగడం, కండరాల నొప్పులు, నిత్య జీవక్రియలు లోపించడం వంటి అనేక అనారోగ్య సమస్యలతో ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది ఈ ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి బయటపడడానికి బీట్రూట్ మరియు అంజీర పండ్ల రసం అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రక్తహీనత సమస్యతో సతమతమవుతుంటే ప్రతిరోజు ఉదయాన్నే బీట్రూట్, అంజీర పండు రసాన్ని సేవిస్తే మన శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, జింక్ మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. బీట్రూట్ మరియు అంజీర పండులో సమృద్ధిగా ఉన్న ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని త్వరితగతిన పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు తద్వారా నీరసం అలసట వంటి సమస్యలు తొలగి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
అంజీర మరియు బీట్రూట్ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదట తాజా బాగా పండిన అంజూర పండ్లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ శుభ్రం చేసుకుని పై చర్మాన్ని తీసివేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి అంజీర వేసుకున్న జారులో వేసి తగినన్ని నీళ్లు వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వడగట్టుకుని అందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అంజీర, బీట్రూట్ రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని నెలల పాటు సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. బరువు తగ్గాలనుకున్న వారికి కూడా ఈ అంజూర్, బీట్రూట్ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది.