ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతిని శ్వాస సంబంధిత వ్యాధులకు కారణాలను పరిశీలిస్తే రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం దానికి తోడు సిగరెట్ బీడీ తాగడం వంటి క్రమ పద్ధతి లేని జీవన విధానం ఆహారపు అలవాట్లు మరియు జన్యు సంబంధమైన కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. చెడు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడితే బ్రాంకైటిస్, న్యుమోనియా ,ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా వంటి ప్రాణాంతక వ్యాధులతో జీవితాంతం పోరాటం చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెరుగుపరచుకోవాలంటే ప్రతిరోజు శ్వాస వ్యవస్థను బలోపేతం చేసే వ్యాయామాలు అలవాటు చేసుకోవడంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవాలి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కాఫీ టీలకు బదులు అల్లం పాలను సేవిస్తే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ అలర్జిటిక్ లక్షణాలు శ్వాస నాళాల్లో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించి వాయునాళాలను శుభ్రపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ప్రతిరోజు అవిసె గింజల కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
రోజువారి ఆహారంలో బ్రోకలీ, క్యారెట్, బీన్స్ వంటివి తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి శ్వాస సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా కలిగిన చేపలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు వంటివి ఆహారంగా తీసుకుంటే శ్వాస వ్యవస్థలోని లోపాలు తొలగిపోతాయి. ప్రతిరోజు యాపిల్, కివి, జామ, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల రసాలను తీసుకుంటే వీటిల్లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు హలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఊపిరితిత్తుల లోపాలను సరిచేసి శాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.