జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా… రెండు చుక్కల ఈ ఆయిల్ తో జిడ్డు చర్మానికి చెక్ పెట్టండి!

సాధారణంగా ప్రతి ఒక్కరూ చాలా అందంగా కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు అయితే కొంతమంది మాత్రం జిడ్డు చర్మంతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఇలా జిడ్డు చర్మ సమస్యలతో బాధపడేవారు ఎన్ని రకాల ఫేస్ ప్రాజెక్టులు ఉపయోగించినప్పటికీ వారి మొహం చాలా అందవిహీనంగా కనపడుతూనే ఉంటుంది.ఇలా జిడ్డు చర్మంతో బాధపడేవారు రెండు చుక్కల ఈ క్యారెట్ ఆయిల్ తో మీ జిడ్డు చర్మానికి ఎంతో తాజాగా కాంతివంతమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

1 ఎమ్ ఎల్ క్యారెట్ ఆయిల్ కు 5 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను కలిపి వాడాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ముఖానికి, చేతులకు, మెడకు అలాగే చర్మం నుండి జిడ్డు ఎక్కువగా విడుదల అయ్యే భాగాల్లో రాసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు ఈ క్యారెట్ ఆయిల్ మన చర్మాన్ని సంరక్షించడంలో ఎంతో దోహదపడుతుంది. క్యారెట్ ఆయిల్ లో జిరానిల్ ఎసిటేట్ మరియు అల్ఫాపైనిల్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే గ్రంథుల నుండి జిడ్డు ఎక్కువగా విడుదల అవ్వకుండా చేయడంలో సహాయపడతాయి.

అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీని వల్ల కూడా కొందరిలో చర్మం నుండి జిడ్డు కారుతుంది. అయితే ఇలా అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మం దెబ్బ తినకుండా చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఈ క్యారెట్ ఆయిల్ ఎంతో దోహదపడుతుంది. ఇక చాలామంది ఎండలో తిరగటం వల్ల తొందరగా డిహైడ్రేషన్ అయి చర్మం మొత్తం పొడిబారి పోతుంది ఇలా డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా క్యారెట్ ఆయిల్ మనకు ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా తరచూ మన మొహం ఎంతో కాంతివంతంగా ఉండడానికి దోహదం చేస్తుంది.