పోషకాహార లోపంతో బాధపడుతున్నారా.. సవరించుకునే మార్గాలివే?

పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మనం తిన్న ఆహారంలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ,మినరల్స్ , విటమిన్స్ , ఖనిజలవణాలు వంటి పోషకాలు లోపిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.మారుతున్న జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం సరిపోదు దాన్ని అధిగమించడానికి మన ఆహారంతో పాటు అత్యధిక పోషక విలువలు ఉన్న డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే పోషకాహార లోపాన్ని సవరించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరం పండ్లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది అనీమియాను దూరం చేస్తుంది.ఉదయం సాయంత్రం వీరిని అల్పాహారం గా కూడా తీసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించి అతి బరువు సమస్యను దూరం చేస్తుంది.

జీడిపప్పు లో అత్యధికంగా ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం ,మెగ్నీషియం, పొటాషియం, పైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.ఇందులొ శరీరానికి వెంటనే శక్తినిచ్చే గుణాలున్నాయి. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఇందులో ఉండే మెగ్నీషిం కణాల అభివృద్ధికి తోడ్పడి జీవక్రియను నియంత్రిస్తుంది. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,జింక్, ఐరన్, యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్స్, పుష్కలంగా లభిస్తాయి. బాదంపప్పులో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఉబకాయం గుండె జబ్బులు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

పిస్తా నీ రెగ్యులర్ డైట్ లో ఉపయోగించడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మెటబాలిజాన్ని మెరుగు వస్తుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కిస్‌మిస్‌ను నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లను తాగితే కడుపు శుభ్రం అవుతుంది. కిస్మిస్ ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ పోషకాలు లభించడంతోపాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది.