నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాతో గాఢనిద్ర మీ సొంతం!

ప్రస్తుతం ఉన్న జీవన విధాన పరిస్థితులలో నిద్రలేమి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. నిద్రలో రెండు రకాలు ఉన్నాయి మొదటిది మత్తు నిద్ర, రెండవది గాఢనిద్ర. మత్తు నిద్ర అంటే మామూలుగా పడుకోవడం, ఎవరు పిలిచినా, చిన్న శబ్దమైన నిద్రలో నుంచి లేస్తాము. కానీ గాడ నిద్ర అలా ఉండదు. ఎటువంటి శబ్దం వచ్చిన నిద్రలేయడం కష్టం అవుతుంది.

మనిషి 100 సంవత్సరాలకు పైగా బతకడానికి ఆస్కారం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితులలో 60 నుంచి 70 సంవత్సరాలు మాత్రమే జీవించడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ నిద్రలేమి సమస్య. ఎంత సంపాదించినా కంటికి కింద కునుక్కు లేకపోతే ఆ జీవితం వ్యర్థం. మనం రాత్రి 9 లేదా 10 గంటలకు భోజనం చేసి నిద్రపోతాం. ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు నిద్రలేస్తాం.

ఎవరైనా మీకు గాఢ నిద్ర ఎప్పుడు పట్టింది అంటే ఉదయం 4 లేదా ఐదు గంటలకు అని చెప్తాం. అంటే ఉదయం నాలుగు వరకు మన శరీరం మేల్కొని ఉన్నట్టే లెక్క. ఎలాగంటే రాత్రి చేసిన భోజనం డైజేషన్ కావటానికి ఉదయం నాలుగు లేదా ఐదు అవుతుంది.అంటే మనం పడుకున్న మన అవయవాలు లోపల పని చేస్తూనే ఉన్నాయి. ఏప్పుడైతే శరీరంలో డైజేషన్ అనేది పూర్తి అవుతుందో అప్పటినుండి శరీరం గాఢ నిద్రలోకి పోతుంది. అది సరైన నిద్ర.

ఇందుకు మనం చేయవలసినది సాయంత్రం 6 లేదా 7 గంటల లోపలనే డిన్నర్ చేసేయాలి. ముఖ్యంగా నైట్ డిన్నర్ గా ఫలహారాలు తీసుకుంటే బాగుంటుంది. అంటే తొందరగా అరిగేవి తినడం ద్వారా రాత్రి 9 లేదా 10 గంటలకు మనం తిన్నదంతా డైజేషన్ అయిపోతుంది. అప్పుడు మనం నిద్రపోతే 5 లేదా 10 నిమిషాల లోపల గాఢ నిద్రలోకి వెళ్లి పోతాము. కడుపు ఖాళీగా ఉంటే పేగులు, గుండె,మెదడు, కిడ్నీలు విశ్రాంతి తీసుకుంటాయి. డైజేషన్ అవసరం లేనప్పుడు గుండె కాస్త తక్కువగా కొట్టుకుంటుంది. ప్రేగులు ఇంకా కండరాల వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉండదు.కాబట్టి నిద్ర సమయంలో కడుపు ఖాళీగా ఉంటే గాఢ నిద్ర పడుతుంది. శరీరానికి అలసట తీరి శరీరం రిఫ్రెష్ అవుతుంది.