హై బీపీ, షుగర్, ఉబకాయ సమస్యలతో బాధపడుతున్నారా…అయితే ఈ లడ్డూను తినాల్సిందే?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటిదే దర్శనమిస్తుంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఊబకాయం,బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యల వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, షుగర్,గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ప్రమాదకర వ్యాధులతో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది.

అధిక పని ఒత్తిడి కారణంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం కుదరని వారు డైటింగ్ వంటివి చేస్తూ కడుపు మాడ్చుకోవడం వల్ల మన శరీరానికి తగిన న్యూట్రియన్స్ లభించక మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడే గుమ్మడి గింజలు,చియా, పుచ్చకాయ విత్తనాలు, అవిసె గింజలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి అతి బరువు, రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలను దూరం చేస్తుంది.

అత్యధిక ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్ ,ఫైబర్, ఐరన్ , కాల్షియం , ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్న గుమ్మడి, చియా, పుచ్చకాయ, అవిసె గింజలతో తాజా
బెల్లం కలుపుకొని లడ్డూల్లాగా తయారు చేసుకొని తినడం వల్ల ఆకలి అనిపించదు. వీటిల్లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉండడం శరీర బరువు పెరిగే సమస్య ఉండదని కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే
ఈ చిరు విత్తనాల లడ్డును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గుమ్మడి, చియా అవిసె, పుచ్చకాయ గింజలను ఓట్స్ ను నెయ్యిలో దోరగా వేయించుకున్న తర్వాత సిద్ధం చేసుకున్న బెల్లం పాకం మీ శ్రమలో చిరిగింజలను వేసి కలియతిప్పాలి.
రుచికోసంజీడిపప్పు ,ఎండు ద్రాక్షను కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని లడ్డుగా మార్చుకొని ప్రతిరోజు సాయంత్రం ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.