గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా చెక్!

900x500_banner_HK-Connect_How-to-Improve-Heart-Health-_-Points-To-Keep-In-Mind

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో గుండె సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యలు కొన్నిసార్లు ప్రాణాలకు సైతం అపాయం కలిగిస్తాయి. కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యలను చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువమందిని చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఎక్కువమందిని ఈ సమస్యలు వేధిస్తుండటం గమనార్హం.

గుండెకు రక్తం పంపిణీ సరిగ్గా జరగని పక్షంలో ఈ సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. వేరుశనగలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వేరుశనగల ద్వారా లభిస్తాయి. వేరుశనగలో ఉండే ఖనిజాల వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నారింజ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.

గుండె సంబంధిత సమస్యలను ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సిట్రస్ పండ్లు వల్ల హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఓట్స్ తినడం ద్వారా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. వాల్ నట్స్ ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గుండె పనితీరును మెరుగుపరచడంలో వాల్ నట్స్ తోడ్పడతాయని చెప్పవచ్చు. ఆవకాడో తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆవోకాడో తినడం వల్ల శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. వీటిలో ఉండే అన్‌-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది.