తరచూ తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారా…. ఇలా చేసి తలనొప్పిని తరిమికొట్టండి!

headaches-1-1665131834

సాధారణంగా చాలామంది పని ఒత్తిడి కారణంగా లేదా బయట కాసేపు తిరిగిన కారణాల వల్ల తరచూ తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు.ఇలా తలనొప్పి కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా తలలో నరాలు మొత్తం లాగిన ఫీలింగ్ కలుగుతూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా తరచూ తలనొప్పి సమస్యలతో బాధపడుతూ ఎన్నిసార్లు మందులు వాడిన తలనొప్పి తగ్గకపోతే ఇలా సహజ పద్ధతులలో సింపుల్ చిట్కాలను పాటించి తలనొప్పి సమస్యను తరిమికొట్టవచ్చు.క్షణాలలో తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

తలనొప్పి సమస్యతో బాధపడేవారు గంధపు చెక్కను నీటితో కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి.ఈ మిశ్రమానికి సమానంగా కర్పూరం కలిపి తలకు పట్టలాగా వేసుకోవడం వల్ల తలనొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఒక గ్లాసు నీటిలోకి ఒక దాల్చిన చెక్క వేసి ఆ గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా తాగటం వల్ల ఈ తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ధనియాలను మెత్తని మిశ్రమంలో రుబ్బి తలమాడుపై పట్టగా వేడి కారణంగా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇక మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు బచ్చలి ఆకులు మెత్తని మిశ్రమంలో తయారుచేసి తల నుదుటిపై రాయటం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక అధికతల నొప్పి సమస్యతో బాధపడేవారు వీలైనంతవరకు తమ పనిలో కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నం చేయాలి.ఇలా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.