బచ్చలి కూర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామంది బచ్చలికూరతో చేసిన వంటకాలను తినడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. బచ్చలికూరతో చేసిన వంటకాల వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో బచ్చలికూర సహాయపడుతుంది. మెదడు, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు బచ్చలి కూరతో సులువుగా చెక్ పెట్టవచ్చు.

బచ్చలి కూర తీసుకోవడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుందని చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో బచ్చలికూరను భాగం చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మూత్ర విసర్జన సమస్యలకు చెక్ పెట్టడంలో బచ్చలికూర ఉపయోగపడుతుంది. శరీరంపై పుండ్లు ఉంటే బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్లపై పెట్టడం ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో బచ్చలి కూర ఎంతగానో సహాయపడుతుంది. పచ్చకామెర్లు వచ్చి తగ్గిన తర్వాత బచ్చలి కూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బచ్చలి ఆకులను తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యకు సైతం సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కీళ్లనొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలకు చెక్ పెట్టడంలో బచ్చలి కూర ఉపయోగపడుతుంది.

బచ్చలికూరను తీసుకోవడం ద్వారా నాలుక మీద ఏర్పడే పొక్కులకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని వేడిని తగ్గించడంలో బచ్చలికూర సహాయపడుతుంది. దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు వేధిస్తుంటే బచ్చలి కూర తీసుకోవడం ద్వారా ఆ సమస్యలు దూరం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.