ప్రస్తుత కాలంలో చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతుంటారు. వీరికి ఏ చిన్న గాయం అయినా తగ్గడానికి చాలా సమయం పడుతుంది. మూత్రం వస్తే ఆపుకోవడం చాలా కష్టం. ఏది తినాలన్నా, ఏది తాగాలన్న భయమే.
రక్తంలో కావలసిన దానికంటే ఎక్కువగా గ్లూకోస్ కణాలు చేరినట్లయితే షుగర్ వచ్చింది అంటారు. మామూలుగా అయితే 80/120 మధ్యలో షుగర్ లెవెల్ ఉంటే వారికి షుగర్ వ్యాధి లేదు అని అనుకోవచ్చు. ఈ లెవెల్ 120 నుంచి 130 వరకు ఉన్న కూడా పరవాలేదు కానీ 140 లేదా 150 ఉన్నట్లయితే వారికి ఫ్రీ డయాబెటిక్ అంటే షుగర్ వచ్చే సూచన ఉంది అని అర్థం.
షుగర్ ని సహజ పద్ధతిలో కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చా అంటే అవునని అంటారు వైద్య నిపుణులు. షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఫైబర్, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే అవి రక్తంలోని గ్లూకోస్ కణాలను నియంత్రణలో ఉంచుతాయి. క్వీనోనా లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా గోధుమ రొట్టె ఇందులో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉండి రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రిస్తుంది ఇది మంచి డైట్ ఫుడ్.
బీన్స్ లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాస్త తిన్న కూడా కడుపు నిండిన ఫీలింగ్ ఏర్పడుతుంది. దీని ద్వారా కూడా మధువేహం కంట్రోల్లో ఉంటుంది. కాయ దాన్యాలను కూడా విరివిగా వాడడంతో అవి కూడా చక్కెర స్థాయిని పెంచకుండా బాగా ఉపయోగపడతాయి. తరువాత సాల్మాన్ లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం కారణంగా వచ్చే గుండెపోటు, స్ట్రోక్ ను నిలుపుదల చేస్తుంది.
గ్రీక్ పెరుగు ను ఉదయం పూట తీసుకుంటే మంచి శక్తి పొందవచ్చు ఇందులో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి చక్కర స్థాయిలను పెంచే ఆస్కారం ఉండదు. ఇంకా అవిసె గింజలు, బెర్రీలలో కూడా మంచి ప్రోటీన్లు ఉండి చక్కెర స్థాయిని పెంచకుండా చేస్తాయి.