డయాబెటిస్, ఉబకాయ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ కషాయాన్ని సేవిస్తే చాలు?

ప్రతిరోజు బొప్పాయి పండు లేదా బొప్పాయి జ్యూస్ ను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన సకల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బొప్పాయి ఆకుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాల్లో స్పష్టం చేయబడింది. బొప్పాయి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి ఆకుల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు, మన శరీరంలోని చెడు మలినాలను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే బొప్పాయి ఆకుల్లో అత్యధికంగా మిటమిన్ సి ఉంటుంది ఇది మనలో వ్యాధికారకాలను తొలగించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బొప్పాయి ఆకుల్లో పుష్కలంగా ఉన్న విటమిన్ బి 9, బి12 ,పోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. కావున డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు బొప్పాయి రసాన్ని లేదా బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అధికంగా జరిగి డెంగ్యూ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.

బొప్పాయి ఆకుల్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలతో పాటు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే ఎంజైమ్ ఉంటాయి కావున బొప్పాయి ఆకు రసాన్ని సేవిస్తే ఆహారం త్వరగా జీర్ణం అయ్యి మలబద్దకం , గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగించడంతోపాటు జీర్ణశయాన్ని శుభ్రం చేసి అనేక క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది.

చక్కెర వ్యాధితో బాధపడేవారు తరచూ బొప్పాయి ఆకు రసాన్ని కషాయంగా సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని తగిన మోతాదులో ఉత్పత్తి చేయడానికి సహాయపడి చక్కర వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది.

అతి బరువు సమస్యతో బాధపడేవారు బొప్పాయి ఆకు రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. సహజంగా మహిళల పీరియడ్స్ సమయంలో నొప్పి సమస్య తలెత్తుతుంది. నొప్పి నుంచి విముక్తి పొందడానికి బొప్పాయి ఆకు రసాన్ని సేవిస్తే కడుపునొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చు.

బొప్పాయి ఆకుల్లో అలర్జీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కావున వీటి కషాయాన్ని సేవించాలనుకున్నవారు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.