సాధారణంగా వాతావరణం లో మార్పులు కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల చర్మ సమస్యలను జుట్టు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాతావరణంలో కాలుష్యం కారణంగా మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది తరచూ చుండ్రు సమస్యతో బాధపడటం జుట్టు రాలే సమస్యతో బాధపడటం జరుగుతుంది.అయితే కొన్నిసార్లు మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాలు లోపించిన సమయంలో కూడా జుట్టు బలహీనపడి రాలడం లేదా తలలో మొత్తం ఇన్ఫెక్షన్ కారణంగా చుండ్రు ఏర్పడటం జరుగుతుంది.
ఇలా చుండ్రు సమస్యతో చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇలా చుండ్రు సమస్య నుంచి బయట పడాలంటే మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలను వాడుతూ ఉంటారు కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా చుండ్రు సమస్యతో బాధపడేవారు పెరుగును ఆహార పదార్థాలలో తరచూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా తరచూ ఆహార పదార్థాలలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల దాదాపు 90 శాతం ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
పోషక విలువల కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు రోజువారి మన ఆహార పదార్థాలలో భాగంగాబాదం పిస్తా వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి ఇలా వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి జింక్ మన తలలో చుండ్రు సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్య నుంచి కాపాడి జుట్టు ఒత్తుగా పెరగడంలో దోహదపడుతుంది.రోజుల్లో తాజా పండ్లు, కూరగాయలు పచ్చివి తినేలా చూసుకోవాలి అదే విధంగా నీటిని కూడా అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.