ఉల్లిపాయ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఉల్లిపాయలో కంటే ఉల్లికాడల్లో అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉల్లికాడలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లికాడలతో రుచికరమైన సలాడ్స్, సూప్స్, కర్రీ, ఫ్రై వంటివి తయారు చేసుకొని తినొచ్చు.
ఉల్లికాడల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్,సల్ఫర్ అధికంగా ఉంటుంది కావున తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది తద్వారా రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఉల్లికాడల్లో ఉన్న విటమిన్ ఏ,గ్జియాంతిన్ అనే పదార్థం కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉల్లికాడల్లో ఎక్కువగా లభించే ఫైబర్, పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను రక్షించి
పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. తద్వారా జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఫైల్స్ జీర్ణాశయ క్యాన్సర్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.తరచూ జలుబు,దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడలతో సూప్ తయారు చేసుకొని తింటే వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు అలర్జీలను తగ్గించి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
తీవ్రమైన మొలల సమస్యతో బాధపడేవారు ఉల్లికాడలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెరుగులో వేసుకొని తింటే మొలల వల్ల కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఉల్లికాడల్లో ఉండే ఫోలేట్లు, ఎంజైమ్స్ గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి. తరచూ కీళ్ల నొప్పులు, కండరాల వాపు సమస్యలతో బాధపడేవారు ఉల్లికాడలను ఆహారంగా తీసుకుంటే నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు. గర్భిణీ మహిళలు తరచూ ఉల్లికాడలను ఆహారంగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డ వెన్నెముక సమస్యలను నివారిస్తుంది మరియు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యలు తొలగిస్తుంది.