స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయవచ్చా…పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలలో ఆ భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా దేవతలకు పెద్దలకు గురువులకు సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల పుణ్యం లభించి స్వర్గం ప్రాప్తిస్తుందని ప్రజల నమ్మకం. ఈ సాష్టాంగ నమస్కారం వల్ల పుణ్యం లభించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అయితే మహిళలు శాస్త్రంగా నమస్కారం చేయకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలా మహిళలు శాస్త్రంగా నమస్కారం చేయవచ్చా? లేదా? లేకపోతే వాటికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలోని 8 భాగాలను ఉపయోగించి చేసే నమస్కారం. మన శరీరంలోని రెండు కాళ్లు, రెండు చేతులు, పొట్ట, ఛాతి, రెండు మోకాళ్లు ఉపయోగించి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. అయితే హిందూ పురాణాల ప్రకారం మహిళలకు సాష్టాంగ నమస్కారం నిషేధించబడింది. మహిళలు పొట్ట, ఛాతి భాగాన్ని నేలకు తాకించి నమస్కారం చేయరాదు. అందువల్ల మహిళలు పంచాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీ గర్భంలో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అలాగే స్త్రీల జాతి భాగం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. ఇవి ఒక ప్రాణం నిలబెట్టగల అవయవాలు కాబట్టి వీటిని నేలకు తకరాదని పురాణాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా పూర్వం స్త్రీలు రుతుక్రమం కాగానే పెళ్లి చేసేవారు. పెళ్లయినప్పటి నుంచి ప్రతి ఏటా పిల్లలకి జన్మ ఇచ్చేవారు.అందువల్ల మహిళ తన జీవితంలో ఎక్కువ భాగం ఎల్లప్పుడూ బసురి బాలింత పాలిచ్చేది. ఈ సమయంలో సాష్టాంగ నమస్కారం చేయడం కష్టం కాబట్టి మహిళలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని ఒక హేతుబద్ధమైన కారణం కూడా ఉంది. అయితే పురుషులు సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల శరీరంలోని ఎనిమిది భాగాలు ఆలయంలో స్వామిని పూజించిన ‘భక్తుల’ పాదధూళిని తాకుతాయి. తద్వారా మన శరీరాన్ని తాకిన ధూళికణాల సంఖ్యకు సమానంగా ‘విష్ణులోకం’లో ఏళ్ల తరబడి నివసించే చోటు లభిస్తుందని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా ఇలా సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల వంద జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి.