నకిలీ డ్రైఫ్రూట్స్ కొని మోసపోతున్నారా… ఈ సింపుల్ చిట్కాలతో నకిలీ వాటిని గుర్తించండి!

"Various snacks,nuts,and dryed fruits in glass dish bowles."

ప్రతిరోజు మన ఆహార పదార్థాలలో భాగంగా గుప్పెడు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను కలిపి తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థం అని చెప్పాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క వంటలోకి వేసుకోవడం వల్ల వంటకు మరింత అదనపు రుచి రావడమే కాకుండా మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త ఖరీదు అయినప్పటికీ చాలామంది వీటిని కొనుగోలు చేస్తుంటారు అయితే కొన్నిసార్లు నకిలీవి కొనుగోలు చేసి మోసపోతూ ఉంటారు.

ఇలా డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు అవి మంచి క్వాలిటీ కలిగిన లేక నకిలీవా అని తెలుసుకొనే సింపుల్ చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ నకిలీవి మార్కెట్లో ఖరీదైన ధరకు అమ్మతో ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలి అంటే ఈ సింపుల్ చిట్కాలతో నకిలీ వాటిని గుర్తించవచ్చు. నిజమైన , నకిలీ డ్రై ఫ్రూట్‌లను పోల్చినప్పుడు.. నకిలీ డ్రై ఫ్రూట్స్ యొక్క రంగులో చాలా తేడా ఉంటుంది. నకిలీ డ్రై ఫ్రూట్స్ రంగు నిజమైన డ్రై ఫ్రూట్స్ రంగు కంటే ముదురు రంగులో ఉంటుంది.

ఇలా నకిలీ డ్రై ఫ్రూట్స్ మనం గుర్తుంచుకున్న ఉండడం కోసం వాటిపై రంగు అధికంగా చల్లుతారు తద్వారా ఇవి నిజమైన డ్రై ఫ్రూట్స్ కంటే కాస్త ముదురు రంగులోనే ఉంటాయి ఎలా ముదురు రంగులో ఉన్నాయి అంటే అవి నకిలీ అని గుర్తించాలి. కృత్రిమంగా తయారు చేయబడిన డ్రై ఫ్రూట్ సక్రమంగా పండవు. అవి చేదు రుచిని కలిగి ఉంటాయి. ఇలా చేదు రుచి వచ్చింది అంటే అవి నాకు లేవని గుర్తు పెట్టుకోవాలి. నకిలీ జీడిపప్పును దాని సువాసన , రంగు ఆధారంగా నిర్ణయించబడుతుంది. నకిలీ జీడిపప్పులో నూనె వాసన వస్తుంది. అంతేకాదు దానిపై పసుపు రంగు ఉంటుంది.
కృత్రిమ ఎండుద్రాక్షలు చక్కెరతో తియ్యగా ఉంటాయి. ఎండుద్రాక్షపై నీటి చుక్క లేదా తేమను మీరు గమనించినట్లయితే, అవి నకిలీవని, వీటిని చేతితో రుద్దితే పసుపు రంగులోకి కనుక మారితే అవి నకిలీ అని గుర్తించాలి.