సాధారణంగా 60 సంవత్సరాల తర్వాత వెన్నెముక బలహీనపడి వంగిపోవడం, పక్కకు జరగడం వంటి సమస్య తలెత్తి తీవ్రమైన నొప్పితో నిటారుగా నిలబడడం, నడవడం, కూర్చోవడం వంటి చర్యలు కష్ట సాధ్యమవుతాయి. కానీ ఈ రోజుల్లో యుక్త వయసులోనే వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అక్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, ప్రమాదకర మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనా వెన్నునొప్పి సమస్య మీలో తలెత్తితే నడిచిన ,కూర్చున్న, పడుకున్న తీవ్ర నొప్పి బాధను అనుభవించాల్సి ఉంటుంది.
పని ఒత్తిడి,అలసట వల్ల వచ్చిన వెన్నునొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అలాకాకుండా దీర్ఘకాలం పాటు ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి. రోజువారి కార్యకలాపాలు తీవ్రమైన వెన్నునొప్పి మెడ నొప్పి నడుము నొప్పి బాధిస్తుంటే దీనికి మరే ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు అందుకే తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి. అలాగే
చేతులు,కాళ్లు, గజ్జలల తిమ్మిర్లు, లాగినట్లు అనిపించిన,నడుము దగ్గరనుంచి ముందుకు వంగినపుడ,దగ్గినపుడు నొప్పి ఎక్కువ అయితున్నట్లయితే అది హెర్నియేటెడే డిస్క్ సమస్య అన్ని భావించవచ్చు.జ్వరం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉండి తరచూ మూత్రానికి వెళ్ల వలసి వస్తుంటే వెన్ను నొప్పితోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్లు గమనించాలి.వెన్ను నొప్పి కాలు వెనుకభాగం మీదుగా కిందికి వస్తే అది సయాటికా సమస్యగా గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు దీర్ఘ కాలం పాటు మిమ్మల్ని వేధిస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవాలి.
వెన్ను నొప్పి సమస్యల నుండి రక్షణ పొందడానికి క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం నడక యోగా వంటివి చేస్తూనే సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకుంటే నరాలు, కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఎక్కువసేపు ఒకే చోట కూర్చొనే వృత్తిలో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి అటు ఇటు కాసేపు తిరిగితే వెన్నెముక మీద ఒత్తిడి తగ్గుతుంది.