మాంసాహారం తినడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపుతారు అయితే తరచూ ఈ మాంసాహారం చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు కనుక తెలిస్తే మాంసాహార ప్రియులలో కాస్త అసంతృప్తి కలుగుతుంది. మాంసాహారం తీసుకుంటే సమృద్ధిగా ప్రోటీన్స్, విటమిన్స్ మినరల్స్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే తాజా పరిస్థితుల దృశ్య మాంసాహారాలైన చికెన్,మటన్ ఎక్కువగా తినేవారిని ప్రమాదకర సూపర్ బగ్ ప్రమాదం వెంటాడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి సూపర్‌బగ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా మనకు మేలు చేస్తే కొన్ని హాని చేస్తాయి.ఇది పరాన్నజీవి జాతిగా చెబుతారు. శరీరంలో దానిసంఖ్య పెరిగినప్పుడు యాంటీబయాటిక్‌పై ప్రభావం పడుతుంది. దీనిని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ స్థితి అంటారు. ఈ పరిస్థితి గల కారణాలను పరిశీలిస్తే గత మూడు సంవత్సరాలుగా కరోనా తీవ్రత నుండి రక్షణ పొందడానికి యాంటీబయాటిక్స్ మందులను ప్రతి ఒక్కరు ఎక్కువగా వినియోగించారు.
ఈ విధంగా యాంటీబయటిక్ ఉపయోగించడమే కాకుండా కరోనా బారిన పడకుండా ఉండడం కోసం అత్యంత పోషక విలువలు కలిగినటువంటి మాంసాహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా జంతువులకు త్వరగా ఎదగడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు, టైలోసిన్ అనే డ్రగ్ వాడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇలా మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఎక్కువ మొత్తంలో యాంటీబయోటిక్స్ వెళ్తున్నాయని నిపుణులు తెలియజేశారు. ఇలా అధికంగా యాంటీబయటిక్స్ ఉండటం వల్ల దీని ప్రభావం రోగం శక్తిపై పడుతుంది తద్వారా మనం చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా కొరికావాల్సి వస్తుందని నిపుణులు తెలియజేశారు.అందుకే తరచూ మాంసం కాకుండా మాంసంలో దొరికే పోషకాలు మనకు గుడ్లు, పాలు ఇతర పదార్థాలలో కూడా లభిస్తాయి కనుక వాటిని కూడా ఆహార పదార్థాలలో భాగం చేసుకోవాలి.