సాధారణంగా కీరదోసకాయలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు సక్రమంగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. అలాగే ఇందులో అధికంగా నీటి శాతం ఉండటం వల్ల వేసవికాలంలో కీర దోసను అధికంగా తినడం వల్ల డిహైడ్రేషన్ కి గురి కాకుండా మన శరీరానికి కావాల్సినంత నీటిని అందించి శరీరం పొడి బారకుండా ఉండడానికి దోహదపడుతుంది.
ఈ విధంగా కీరదోసకాయ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది భోజనం చేసే సమయంలో భోజనంతో పాటు కీరదోసను తింటూ ఉంటారు. అయితే ఇలా భోజనం చేసే సమయంలో కీరదోసను పూర్తిగా పక్కన పెట్టాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.కీర దోసకాయను మనం భోజనంతో పాటు తినడం వల్ల కఫం వాత పిత్త వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
మనం ఆహారం తినే సమయంలో ఆహారం బాగా ఉడికించి ఉంటాము. అలాగే కీర దోసకాయను పచ్చిగా తింటాము ఇలా ఉడికించి, ఉడికించని ఆహార పదార్థాలను రెండు ఒకేసారి తినటం వల్ల మన శరీరంలో ఆమ్లం ఏర్పడి పలు అసమతుల్యతలు ఏర్పడతాయి.అందుకే భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత కీరదోసకాయలను తినడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇలా ఉడికించిన పచ్చి ఆహార పదార్థాలను ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు ఏర్పడతాయి. జీర్ణ వ్యవస్థ పై ఆ ప్రభావం పడటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో గ్యాస్ మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే భోజనానికి ఒక గంట ముందు లేదా గంట తర్వాత కీరదోస తినడం మంచిది.