బీరకాయను తొక్కతీసి తింటున్నారా…. ఈ ప్రయోజనాలను కోల్పోయినట్టే?

శీతాకాలంలో సమృద్ధిగా లభ్యమయ్యే పందిరి జాతి కూరగాయల్లో బీరకాయ ప్రధానమైనది గానే చెప్పొచ్చు. బీరకాయలో సమృద్ధిగా నీరు, పీచు పదార్థం, అమైనో ఆమ్లాలు విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ ,పొటాషియం ,మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మన ఆరోగ్యానికి హాని కలిగించి సోడియం, కొలెస్ట్రాల్ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. కావున రోజువారి ఆహారంలో తప్పనిసరిగా బీరకాయను తినొచ్చు.

చాలామంది బీరకాయ పై తొక్కను తొలగించి ఎక్కువగా తింటుంటారు.అలా చేయడం మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. బీరకాయ తొక్కలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు మెండుగా లభిస్తాయట. బీరకాయ తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కావున శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడంలో సహాయపడి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బీరకాయ పై తొక్కను నీడలో ఎండబెట్టుకుని అందులో కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చిని కలిపి దోరగా వేయించుకున్న తర్వాత పొడిగా తయారుచేసుకుని తరచూ ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

బీరకాయలో సమృద్ధిగా విటమిన్ బి12, మెగ్నీషియం లభిస్తుంది కావున నాడీ కణ వ్యవస్థను, మెదడు కండరాలను ఉత్తేజపరిచి మెదడు ఆరోగ్యాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. బీరకాయలు సమృద్ధిగా లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.జీర్ణశక్తిని పెంచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి ఉబకాయం, పొట్ట కింద కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. బీరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ చర్మ ఆరోగ్యానికి సహాయపడి మొటిమలు, ముడతలు, నల్లని వలయాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.