కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..?అయితే మీరు ప్రమాదంలోపడ్డటే?

ప్రస్తుత కాలంలో ప్రజలు కూల్ డ్రింక్స్ తాగటానికి బాగా అలవాటు పడ్డారు. ముఖ్యంగా వేసవి కాలంలో వేడిని భరించలేక ప్రతిరోజు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఇలా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు లేదా మూడు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది.

ముఖ్యంగా మహిళలు ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్‌, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 95464 మంది మహిళలను 24 సంవత్సరాల పాటు పర్యవేక్షించగా వీరిలో ఇలా కూల్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగే 109 మంది మహిళలు 50 సంవత్సరాల లోపు పెద్ద ప్యాకెట్ క్యాన్సర్ బారినపడి మరణించారు. ఈ పెద్ద పేగు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణహాని ఉండదు. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

అయితే ఇలా ప్రతిరోజు ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుండా ఎప్పుడో ఒకసారి కూల్‌డ్రింక్‌ తాగే మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. చాలా కాలం నుండి కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కూల్ డ్రింక్స్ తయారు చేయడానికి కృత్రిమ చక్కెర, ప్రిజర్వేటివ్‌లు మొదలైన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఉబకాయం సమస్య తలెత్తుతుంది. దీంతో చిన్నతనంలోనే ప్రీమెచ్యూర్ హార్ట్, బీపీ, మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు వెంటడుతాయి. అంతే కాకుండా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల కాలేయా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కూల్ డ్రింక్స్ ఉన్న ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేయడానికి కాలేయం చాలా కష్టపడాలి. అందువల్ల తరచు కాలేయంలో వాపు వస్తుంది.