కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు కూడా ఉంటాయి జాగ్రత్త!

bottle-coconut-water-put-dark-background_1150-28239

ప్రకృతి అందించిన దివ్యజౌషధం కొబ్బరి. కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనిషికి ఏదో ఓ రకంగా ఉపయోగపడేదే. కొబ్బరి నీళ్లు మనిషి ఆరోగ్యానికి జౌషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లుతాగితే గుండెకు సంబంధించి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా… బరువు తగ్గుతారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.  జ్వరం.. లేదా ఎదైనా సమస్యలు వచ్చినా.. పరామర్శించేందుకు వచ్చేవారికి ముందుగా గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాలే.

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు త్వరగా నిరసించిపోతారు ఇలా నిరసించకుండా ఉండాలంటే చాలామంది కొబ్బరి నీళ్లు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని కొబ్బరికి పేరుంది. కొబ్బరి నీళ్లలో ఉంటే ఖనిజాలు.. శరీరానికి శక్తినిస్తాయి.  ఇదిలా ఉంటే కొబ్బరి నీరును తీసుకునే కొన్ని సందర్భాల్లో ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొబ్బరి నీటిని తీసుకుంటే… సమస్యలు ఏర్పడుతాయి.

 

కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ తరచూ జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు కూడా .. కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి. శరీరంలో నీటిని పెంచి విరేచనాలకు కారణం అవుతుంది. కొందరికి ప్రతీసారి జలుబు చేస్తుంది. వీరు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరినీరు చల్లగా ఉండటంతో.. మళ్లీ జలుబు పెరిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటుకు మందులు వాడే వారు కొబ్బరీ నీరు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. దీని వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. ఇలా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ మందులు వాడేవారు కొబ్బరినీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ల సూచనల మేరకే కొబ్బరినీళ్లు తాగడం మంచిదని చెప్పాలి.