చలి సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఏడాది సమ్మర్ ప్రారంభంలోనే విపరీతమైన ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడి నుంచి రక్షణ పొంది శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్యకు గురి కాకుండా ఉంచుకోవడానికి ఇప్పటినుంచి ప్రతిరోజు కొన్ని ఆహార నియమాలను అలవాటు చేసుకోవాలి. ఈ ఎండాకాలం మొత్తం సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడంతోపాటు శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించి ఆరోగ్యవంతమైన పానీయాలను ఎక్కువగా తాగాలి.
మనందరికీ అందుబాటులో ఉండే నిమ్మ కాయతో ప్రతిరోజు ఉదయాన్నే రుచికరమైన నిమ్మ పానీయాన్ని తయారు చేసుకొని సేవిస్తే నిమ్మకాయలో ఉండే 53 మిల్లీగ్రాముల విటమిన్ సి,9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడి రోజంతా మిమ్మల్ని అలసిపోనివ్వకుండా శరీరంలోని లవణాలను కోల్పోనివ్వకుండా వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అన్ని ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి రక్షణ కల్పిస్తుంది.
సమ్మర్లో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కావున ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నిమ్మకాయలు సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తొందరగా పొడివారనివ్వదు తద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది.ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్లు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ను సమృద్ధిగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట, నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తొలుగుతాయి.ఎండవేడికి శరీరం తొందరగా నీటి శాతాన్ని, లవణాలను చెమట రూపంలో కోల్పోతుంది. కావున నిమ్మరసంలో చిటికెడు ఉప్పు,తేనె, జిలకర పొడి కలుపుకొన అలసటగా ఉన్నప్పుడు సేవిస్తే శరీరం కోల్పోయిన లవణాలన్నీ తిరిగి లభించి శరీరం శక్తివంతం అవుతుంది