మనలో చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో వాటర్ బాటిల్స్ లోని నీళ్లు తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తక్కువ ధరకే వాటర్ బాటిల్స్ దొరకడంతో పాటు ఆ వాటర్ కూల్ గా ఉండే మినరల్ వాటర్ కావడంతో ఈ వాటర్ తాగడానికి ఆసక్తి చూపేవాళ్ల సంఖ్య ఉంటుంది. అయితే వాటర్ బాటిల్స్ లోని మినరల్ వాటర్ గురించి, ఆ వాటర్ ఎక్స్ పైరీ డేట్ గురించి అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.
అయితే బయట దొరికే వాటర్ బాటిల్స్ ను ఒకసారి వాడిన తర్వాత మళ్లీ ఉపయోగించకూడదు. అయితే వాటర్ బాటిల్ లోని వాటర్ కు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్ పైరీ డేట్ పూర్తైన తర్వాత వాటర్ బాటిల్ లోని వాటర్ ను తాగకుండా ఉంటే మంచిది. వాటర్ బాటిల్ లోని నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్, వంధత్వంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగకుండా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్ ను తయారు చేయడానికి కొన్ని కెమికల్స్ ను వినియోగించడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ను వాడటం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల భవిష్యత్తులో అనేక వ్యాధులు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ ను కాపాడే ఎండోక్రైన్ వ్యవస్థను పాడు చేస్తుందని చెప్పవచ్చు.