మట్టికుండలో నీళ్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని సమస్యలు వస్తాయా?మనలో చాలామంది మట్టికుండలో నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఫ్రిజ్ లోని నీళ్లను తాగినా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అయితే మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల ఆ సమస్య కూడా ఉండదు.
మట్టి కుండను వాడేవాళ్లు రెండు రోజులకు ఒకసారి మట్టి కుండను శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువరోజులు నీటిని అలాగే నిల్వ ఉంచితే నీటిలో క్రిములు చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లోపలినుంచి కుండను బాగా శుభ్రం చేయని పక్షంలో కొన్ని రకాల క్రిములు కుండలో అలాగే ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కుండను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వేర్వేరు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మట్టి కుండను వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కుండను ఏడాది కంటే ఎక్కువగా వాడటం కూడా కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం కుండను మార్చితే మంచిదని చెప్పవచ్చు.
మన దేశంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు మట్టి కుండలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మట్టి కుండ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నిర్లక్ష్యం చేస్తే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇంట్లో మట్టి కుండను వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుని కుండను శుభ్రంగా ఉంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి.