సాధారణంగా చలికాలం వచ్చిందంటే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణం లో ప్రమాదకర సూక్ష్మజీవులు శాతం పెరిగి జలుబు, దగ్గు,జ్వరం వంటి అనేక అనారోగ్య సమస్యలతో పాటు చర్మం పొడి వారడం, చుండ్రు సమస్య, పెదవులు పగిలి అంద విహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పెదవులు పొడి వారి పగలడం వల్ల తీవ్రమైన నొప్పితో రక్తస్రావం కూడా కలుగుతుంది.
చలికాలంలో పెదవులను మృదువుగా ఉంచుకోవడానికి చాలామంది పెట్రోలియం జల్లిలను, రసాయనాలు కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఈ లిప్ బామ్ లో ఉన్న ప్రమాదకర రసాయనాలు మనం నీళ్లు తాగినప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఒక్కొక్కసారి చర్మ క్యాన్సర్లకు కూడా దారి తీయవచ్చు ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పెదవుల మృతత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
చలికాలంలో మన శరీరాన్ని ఎక్కువగా సబ్బుతో పదేపదే కడగడం తగ్గించాలి. మరి ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా శరీరంతో పాటు పెదవులు కూడా పొడిబారడం జరుగుతుంది అందుకే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు సహజ సిద్ధమైన కొబ్బరినూనెను పెదవులపై మర్దన చేసుకుంటే కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉన్న విటమిన్స్ ఈ యాంటీ మైక్రోవేల్ గుణాలు పెదవుల చర్మాన్ని మృదువుగా పగుళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది.
పెదవులు పగిలి తీవ్రమైన నొప్పి రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతుంటే తేనెను పెదవులపై సున్నితంగా అప్లై చేస్తే తేనెలో ఉన్న ఔషధ గుణాలు పెదవుల చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు పగిలిన గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న బాదం నూనెను పగిలిన పెదాలపై మర్దన చేసుకుంటే పెదవులు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండడంతో పాటు అందమైన గులాబీ రంగు పెదాలు మీ సొంతం అయినట్లే…