మహిళలు డెలివరీ తర్వాత శరీర బరువు పెరుగుతున్నారా… బరువు తగ్గే వంటింటి చిట్కాలివే!

సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య తొందరగా శరీర బరువు పెరగడం దాని కారణంగా అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయి గుండె జబ్బులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం వంటి సమస్యలు ఎక్కువమందిని వేధిస్తున్నాయి.ముఖ్యంగా మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిలో సహజ మార్పులు కారణంగా డెలివరీ తర్వాత చాలామందిలో శరీర బరువు తొందరగా పెరుగుతుంది.
దాంతోపాటే పిల్లల పోషణలో పడి వారి ఆరోగ్యం పై కొంత అశ్రద్ధ వహిస్తారు.

మహిళలు ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ తరువాత చాలా రోజులపాటు శారీరక శ్రమ కలిగిన వ్యాయామాలు, నడక, రన్నింగ్ వంటివి చేయలేరు కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి అతి బరువు సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలకు మన ఇంట్లోనే వంటింటి చిట్కాలను ఉపయోగించి సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలు మానసిక ప్రశాంతత అలవర్చుకొని స్వల్ప శారీరక శ్రమ కలిగిన చిన్న చిన్న వ్యాయామాలు, ప్రాణాయామం , ఉదయం సాయంత్రం కొంత దూరం నడక వంటివి చేస్తూ ఉంటే శరీరంలో హార్మోనుల సమతుల్యత ఏర్పడి బరువు పెరిగే సమస్య ఉండదు.

ప్రెగ్నెన్సీ సమయంలోను డెలివరీ తర్వాత కూడా పూర్తిగా వేడి నీళ్లు మరీ చల్ల నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే శరీర జీవక్రియ రేటు పెరిగి శరీరంలోని చెడు మలినాలు తొలగించబడతాయి. కాఫీ టీలకు బదులు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ లో తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే శరీర బరువు తొందరగా తగ్గుతుంది.మన వంటింట్లో కచ్చితంగా ఉండే దాల్చిన చెక్క లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కావున ఒక గ్లాసు నీటిలో 2 నుంచి 3 లవంగాలు వేసి దాల్చిన చెక్క ముక్క వేసి బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్న కషాయాన్ని సేవిస్తే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తరిగిపోతుంది. మరియు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.రాత్రి సమయంలో గోరువెచ్చని పాలల్లో జాజికాయ పొడిని కలుపుకొని సేవిస్తే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది తద్వారా అతి బరువు సమస్య కూడా దూరమవుతుంది.