ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రతిరోజు వ్యాయామం చేయడంలో అనేక సందేహాలు అపోహలు కలిగి చివరికి వ్యాయామం చేయడమే చాలామంది మానేస్తుంటారు. ముఖ్యంగా వ్యాయామం చేసే విషయంలో చాలామందికి తలెత్తే సందేహం ఏమిటంటే సన్నగా ఉన్నవారు వ్యాయామం చేయొచ్చా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. సాధారణంగా లావుగా ఉండి అతి బరువు సమస్యతో బాధపడే వారు మాత్రమే వ్యాయామం చేయాలి.సన్నగా ఉన్నవారు ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని అందరూ భావిస్తుంటారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం లావుగా ఉన్న వారైనా సన్నగా నాజుగా ఉన్న వారైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే. కాకపోతే వ్యాయామం చేసే పద్ధతుల్లో కొంత మార్పు ఉంటుంది. సన్నగా , బలహీనంగా ఉన్నవాళ్లు నిపుణుల సూచనల మేరకు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.ఎవరైనా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలై శారీరక మానసిక ఒత్తిడి తగ్గి మిమ్మల్ని ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఒంట్లో అధికంగా ఉండే క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. సన్నగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే సంపూర్ణ పోషకాహారం తీసుకోవడంతో పాటు నిపుణుల సూచనల మేరకు కొన్ని కొన్ని వ్యాయామాలు తప్పనిసరి.
ముఖ్యంగా సన్నగా ఉన్నవారు అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడం కంటే కార్డియో వర్కవుట్స్ కన్నా స్ట్రెంత్ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. ఒకేవిధమైన ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, స్కిప్పింగ్, డంబెల్ రో ఇలాంటివి ప్రయత్నించడం వల్ల కండరాలు గట్టిపడి శరీరాకృతి అందంగా తయారవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చెప్పలు వేసుకోకుండా నడవడం వల్ల మెదడు కణాలు చురుగ్గా మారుతాయి తద్వారా మానసిక ఒత్తిడి, కంగారు, బద్ధకం వంటి లక్షణాల నుంచి బయటపడవచ్చు.