ఈ మధ్యకాలంలో చిన్నతనం నుండే కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడి అందహీనంగా కనపడుతున్నామని బాధపడుతుంటారు. సహజంగా అయితే వృద్ధాప్యం సంభవించినప్పుడు ఇలా వచ్చే అవకాశం ఉంది కానీ చిన్న చిన్న పిల్లలలో అంటే దాదాపు 7 లేదా 8 సంవత్సరాల నుండి ఇలా ఏర్పడడం చూస్తున్నాము. దీనికి ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ లేవు అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు ఫోన్లు, టీవీలకు ఎక్కువ సమయం కేటాయించి ఇవ్వకూడదు. వాటి ప్రభావం వల్ల కళ్ళు మండి తర్వాత కళ్ళ కింద చర్మం నల్లగా మారుతుంది.
ఇక రెండవ విషయంగా నిద్ర సరిగా లేకపోవడం, నిద్ర అనేది ఆరు నుండి ఎనిమిది గంటలు కచ్చితంగా తీసుకోవాలి. ఇంకా కొంతమంది డస్ట్ ఎలర్జీ వల్ల వీళ్ళతో కళ్ళ దగ్గర రుద్దడం వల్ల కూడా చర్మం దెబ్బతిని నల్లగా మారే అవకాశం ఉంది. చక్కగా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఎక్కువ శ్రమ లేకుండా ఈ కళ్ళ కింద నలుపును పోగొట్టవచ్చు. మన ఇండ్లలో పాలను వేడి చేసినప్పుడు దానిపై మీగడ అనేది వస్తుంది.
ఆ మీగడను కళ్ళ చుట్టూ ఒక నిమిషం మసాజ్ చేసుకుని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కళ్ళ కింద నలుపుతనం తగ్గడాన్ని గమనించవచ్చు. ఇంకా రాత్రి పాలలో ఒక రెండు బాదం విత్తనాలను నానబెట్టి ఉదయం గంధపు చెక్కతో రుద్ది ఆ పేస్టును ఒక రెండు నిమిషాలు కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాలామంది కీరదోసకాయను కళ్ళ పై పెట్టుకుంటారు. తడి ఆరిపోయిన వెంటనే తీసేయాలి. ఇక పొటాటోను కూడా వాడుతారు దీని వల్ల సమస్య తగ్గడం కాదు మరింత పెరుగుతుంది. ఐస్ ప్యాడ్ లను పాలలో ముంచి కళ్ళపై పెట్టుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.