మానవ జీవన విధానంలో అనుకోకుండా వచ్చే సమస్యలు, జరిగే సంఘటనలు మన ప్రమేయం లేకపోయినా మనల్ని చుట్టుముడతాయి. దీనికి కొన్ని కారణాలు ఇంట్లో పాటించవలసినవి సరిగా పాటించకపోవడం వల్ల తలెత్తుతాయి అంటారు జ్యోతిష్య పండితులు. అలాంటి కొన్ని విషయాలు మీకోసం.
మనం ఉండే నివాసంలో ఎట్టి పరిస్థితులలోనూ గుర్రం ఉన్న చిత్రపటాలను, బొమ్మలను ఉంచుకోరాదు. ఒకవేళ ఇవి గనక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంటి నుంచి తక్షణమే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఒకసారి శ్రీమహావిష్ణువు పిలిచినా కూడా పలకలేదు లక్ష్మీదేవి. అలా వైకుంఠసారుని కోపానికి గురై వైకుంఠాన్ని వదిలి కొంతకాలం గుర్రం రూపంలో జీవించవలసి వచ్చింది. అందుచేత గుర్రం అంటే లక్ష్మీదేవికి నచ్చదు. అవి ఉండే చోట నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఆవు పాలతో చేసే నైవేద్యాన్ని పూజలో ఉంచాలి, ఆవు పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి, ఏ ఇంట్లో అయితే ఇలా చేస్తారో ఆ ఇంటికి తన పుట్టింటికి వచ్చినంత ఆనందంతో వస్తుంది లక్ష్మీదేవి. ఇంకా ఎరుపు రంగు వస్త్రాలు, అనేక రకాలైన పూలు, గంధం, దీపరాదాలు చాలా ప్రీతి.
లక్ష్మీదేవికి అన్నింటికంటే ఇష్టమైనది మంచి మాటలు మాట్లాడడం. అబద్ధాలు, ఈర్ష్య ఉండేవాళ్లు అస్సలు నచ్చరు. ఇంట్లో పూజ చేసుకునే మహిళలు ఆకుపచ్చ దుస్తులు, పురుషులు అయితే తెలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. సుఖశాంతులతో ఆ ఇల్లు వెలుగుతుంది.
పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి వ్రతం చేసినట్లయితే దాని ఫలితంగా ఆమె కటాక్షం తొందరగా పొందవచ్చు. ఇక నైవేద్యంగా బియ్యం నానబెట్టి చేసిన ఉండ్రాళ్ళు, అరటిపండు, బెల్లం ఇంకా బియ్యంతో చేసిన పదార్థాలు చాలా ప్రీతి. చక్కగా వీటిని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు.