మారుతున్న కాలానికి అనుగుణంగా గాలిలో ఉండే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఆయా వ్యాధులు లేదా ఆరోగ్య ప్రయోజనాల నుంచి శరీరాన్ని కాపాడటానికి దోహదం చేస్తుంది.అయితే మనం పోషకాహార లోపం కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.ఇక మనలో రోగనిరోధక శక్తి కనక తగ్గిపోయింది అంటే ముందుగా మన శరీరంలో ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
ఎప్పుడైతే మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందో ఆ సమయంలో కళ్ళు మొత్తం పొడి బారుతు ఉంటాయి. కళ్ళు మొత్తం మంటలు ఏర్పడటం అలాగే దృష్టి కూడా సరిగా కనిపించకపోవడం జరుగుతుంది.ఇక మన శరీరంలో ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుందో ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోతాము. ఈ స్థితిలో రోగనిరోధక వ్యవస్థ మెదడుకు తాపజనక కణాలను పంపుతుంది. దీనివల్ల సమస్య మరింత ముదురుతుంది.
ఇక చర్మంపై దద్దుర్లు, తామర కనుక ఏర్పడితే మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయినట్లేనని అర్థం. వీటితోపాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కనుక ఎదుర్కొంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బాధపడుతున్నారని అర్థం ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనబడితే వెంటనే పోషక విలువలతో కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉన్నటువంటి పండ్లు పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.