మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు, ఆహార పదార్థాలు ఇవే!

మన శరీర నిత్య జీవక్రియలను సమన్వయ పరచడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది.మెదడు కండరాలు మరియు నాడీ కణాలు అతి సూక్ష్మమైన, సున్నితమైన కండరాలతో ఏర్పడి ఉంటాయి. వీటికి రక్షించడంలో మెలనిన్ తొడుగు కీలకపాత్ర పోషిస్తుంది అయితే మన రోజువారి ఆహారపు అలవాట్ల , తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా నాడీ కణ వ్యవస్థ బలహీనపడి మెదడు చురుకుదనం తగ్గుతుంది ఫలితంగా అల్జీమర్, చిత్త వైకల్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మన రోజువారి ఆహారంలో మోతాదుకు మించి చక్కెర, ఉప్పు, మసాలా ఫుడ్, రెడ్ మీట్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మెదడు ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా తగ్గి ఉబకాయ సమస్య తలెత్తుతుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి వయసు మళ్లిన పెద్దల వరకు ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలనే తినటానికి ఇష్టపడుతున్నారు ఫలితంగా ఇందులో ఉండే ప్రమాదకర చెడు కొలెస్ట్రాల్ నిల్వలు మెదడు ఆరోగ్యాన్ని క్షీణింప చేసి జ్ఞాపకశక్తిని, మానసిక అంగవైకల్యాన్ని కలగజేస్తుందని అనేక సర్వేలో వెల్లడింది.

ముఖ్యంగా ఈనాటి యువతరానికి లైఫ్ స్టైల్ లో భాగంగా మారిన ఆల్కహాల్ సేవించడం భవిష్యత్తులో తీవ్రమైన మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. అలాగే ధూమపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల కారణంగా మెదడు కండరాలు బలహీనంగా మారి మానసిక అంగవైకల్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

భవిష్యత్తులో మెదడు సంబంధిత రుగ్మతలకు దూరంగా ఉండాలంటే రోజువారి ఆహారంలో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే అత్యధిక ప్రోటీన్స్ మెదడు, నాడీ కణ వ్యవస్థను దృఢంగా ఉంచి మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు తప్పనిసరిగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా కలిగిన చేపలను ఆహారంగా తీసుకోవాలి, మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా కలిగిన పండ్లు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.