ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచుతున్నారా… ఫ్రిజ్లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారి పనులలో బిజీ కావడం వల్ల సరైన సమయానికి భోజనం చేసుకొని తిని సమయం కూడా లేకుండా పోతుంది దీంతో చాలా మంది ఒకేసారి అధిక మొత్తంలో ఆహార పదార్థాలను తయారు చేసే ఫ్రిజ్లో పెట్టుకొని దానిని మరల ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.ఇలా ఫ్రిడ్జ్ లో నిల్వచేసిన ఆహార పదార్థాలు చెడిపోవాలని అందుకే ఒకేసారి అధిక మొత్తంలో ఆహారాన్ని తయారు చేసి పెడతారు. అయితే ఇలా ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను తినడం ఎంతవరకు మంచిది? ఒకవేళ తిన్న ఎన్ని రోజులపాటు ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలను నిల్వ చేయవచ్చు అనే విషయానికి వస్తే…

సాధారణంగా మనం ఆహార పదార్థాలను తయారు చేసే సమయం లోనే ఆహారంలో ఉన్నటువంటి కొన్ని పోషకాలు పూర్తిగా నశిస్తాయి మనం ఆహారం వండిన తర్వాత దానిని గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరిచి మనం తిన్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో దాచిపెడతాము. ఈ క్రమంలోనే మనం సాధారణంగా వండిన ఆహార పదార్థాలలో బ్యాక్టీరియా అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అందుకే మనం ఫ్రిజ్లో దాచి ఉంచే ఆహార పదార్థాలకు ఏమాత్రం బయట గాలి చొరబడకుండా పూర్తిగా కప్పి వేసి ఉండాలి.

ఇలా గాలి చొరబడకుండా భద్రంగా నిల్వ చేయడం వల్ల ఆహార పదార్థాలను మూడు నుంచి నాలుగు రోజుల వరకు తినవచ్చు అనంతరం ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా పెరుగుతుంది కనుక ఆహార పదార్థాలు విషమంగా మారే అవకాశాలు ఉంటాయి అందుకే మూడు రోజులు లేదా నాలుగు రోజులకు మించి ఆహార పదార్థాలను అధికంగా రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచుకొని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక మనం ఫ్రిజ్లో ఆహార పదార్థాలను నిల్వ చేసే సమయంలో పూర్తిగా గాలి చొరబడకుండా ఉన్న కంటైనర్ లో వేయాలి. పాత ఆహార పదార్థాలను ఫ్రీజ్ ముందు భాగంలో పెట్టి తాజాగా తయారు చేసుకున్న లోపల పెట్టాలి. ఎక్కువగా పైన ఉన్నటువంటి ర్యాక్ లో ఆహార పదార్థాలను నిల్వ చేయాలి ఎక్కువ చల్లగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు తొందరగా చెడిపోకుండా ఉండటానికి వీలవుతుంది. ఇక మనం తినే ముందు ఒకసారి ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెక్ చేసే తినడం ఎంతో మంచిది.