ఈ ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాంటి ఓ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముళ్ళ గోరింట చెట్టు అని పిలవబడే ఈ మొక్కకు అందమైన పూలు పూయడంతో పాటు ఈ మొక్క కాండం, వేర్లు, ఆకు మరియు పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ముళ్ళ గోరింట ఆకుల్లో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణంగా చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. గజ్జి ,తామర, పుండ్లు, దురద వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు ముళ్ళ గోరింట ఆకుల లేపనాన్ని సమస్య ఉన్న చోట రాసుకుంటే చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి.
నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్లలో రక్తస్రావం, నోట్లో పుండ్లు వంటి సమస్యలతో బాధపడ్డారు ముళ్ళ గోరింటాకు ఆకుల కషాయాన్ని తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు పుక్కిలిస్తే ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ముళ్ళ గోరింట వేర్లతో పండ్లను తోముకుంటే దంత క్షయం, గార తొలగిపోయి దంతాలు తెల్లగా సహజ రంగును పొందుతాయి.
ముళ్ళ గోరింట మొక్క బెరడును నీడన ఆరబెట్టి పొడిగా తయారు చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ పరిమాణంలో తీసుకుంటే ఒళ్ళు నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
ముళ్ల గోరింట మొక్క ఆకులను మెత్తని మిశ్రమంగా మార్చి నొప్పి ఉన్నచోట రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముళ్ళ గోరింట ఆకుల్లో కొన్ని అలర్జీ లక్షణాలు ఉన్నాయి కావున కొందరిలో అలర్జీ సమస్యలు తలెత్తవచ్చు. అలాంటివారు ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.