శాఖాహార ప్రియులు రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే?

మాంసాహారంలో మాత్రమే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది అన్న భావన చాలామందికి ఉంటుంది. అయితే శాకాహార ప్రియులు సంగతేంటి అంటారా.మన శరీరానికి అవసరమైన పోషకాలు కేవలం మాంసాహారం లోనే కాదు పండ్లు,కూరగాయలు ఆకుకూరల్లో కూడా సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా చిక్కుడు జాతి కూరగాయల్లో ఒకటైన బీన్స్ లో అత్యధిక ప్రోటీన్స్ లభించి మన శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. కనుక శాఖాహారులు తప్పనిసరిగా బీన్స్ ను ఆహారంగా తీసుకోవాలని చెప్తుంటారు

తరచూ బీన్స్ ను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ఏ,విటమిన్ బి6, థయామిన్, పాంతోథేనిక్ యాసిడ్, నియాసిన్, ఫైబర్, కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, సోడియం మినరల్స్ సమృద్ధిగా లభించి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. బీన్స్ ను పేదోడి మటన్ అని కూడా పిలుస్తుంటారు.బీన్స్ ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే
బీన్స్‌లో సమృద్ధిగా ఉండే ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం బరువును సులువుగా నియంత్రించడంలో సహాయపడుతుంది.

బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్ మరియు ప్రోటీన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి చక్కర వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
బీన్స్ లో ఉండే థయామిన్, పాంతోథేనిక్ ఆమ్లాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడి సహాయపడి గుండెపోటు రక్తపోటు వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. బీన్స్ లో సమృద్ధిగా లభించే మెగ్నీషియం గుండె ,మెదడు కండరాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఐరన్, కాపర్ వంటి మూలకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి నిరంతరం మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది.